శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 11 మే 2020 (20:20 IST)

మదర్స్ డే నాడు నాట్స్ ఓంకార నాదం, మాతృమూర్తులకు వెబినార్ ద్వారా అభినందనలు

టెంపాబే: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించింది. మాతృమూర్తులకు శుభం కలగాలని కోరుకుంటూ 108 సార్లు ఓంకార మంత్రాన్ని జపించింది. 
 
ఈ కార్యక్రమంలో వందకు పైగా మహిళలు వెబినార్ ద్వారా హాజరై మాతృమూర్తుల సంక్షేమం కోసం ఓం మంత్రాన్ని జపించారు. యోగా నిపుణురాలు రమ జొన్నలగడ్డ, ఓం ఉచ్ఛారణ ఎలా చేయాలి..? ఓం ఉచ్ఛారణ వలన కలిగే లాభాలను ఈ వెబినార్‌లో వివరించారు. నాట్స్ వైస్ ఛైర్మన్ అరుణగంటి మన జీవితాల్లో అమ్మకు మనం ఇవ్వాల్సిన విలువ, ఆమె అందించే ప్రేమానురాగాల గురించి తెలిపారు. 
 
కుమారి లయ అమ్మ గురించి మంచి పాట పాడి అందరికి తమ మాతృమూర్తులను గుర్తు చేశారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహారించారు. 
 
నాట్స్ టెంపాబే సమన్వయకర్త రాజేశ్ కాండ్రు, నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ ఆరికట్ల, రాజేశ్, సుధీర్, విష్ణు, శ్రీథర్, జయశ్రీ, జ్యోతి వనం, రమ కామిశెట్టి, రజనీ, శిరిష, బిందు బండ,శిరీష దోడ్డపనేని తదితరులు ఈ వెబినార్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి .. నాట్స్ మహిళా విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.