తానా జాతీయ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు... విజయం సాధించిన సఫేద్ హాతి టీం

TANA Cricket
ivr| Last Modified గురువారం, 28 మే 2015 (15:21 IST)
డిట్రాయిట్‌లో 20వ తానా మహాసభల సందర్భంగా జరిగిన క్రికెట్ లీగ్ పోటిలలో సఫేద్ హాతి టీం, ఫాల్కన్స్ టీంపైన విజయం సాధించి ప్రతిష్టాత్మక తానా కప్‌ను, $౩౦౦౦ నగదు బహుమతిని, విజయపతకాలని అందుకున్నది. ఉత్కంఠభరితంగా జరిగిన తుది సమరం నువ్వా నేనా అన్నట్లు సాగింది. రన్నర్స్‌గా నిలిచిన ఫాల్కన్స్ 1500 డాలర్ల నగదు బహుమతిని, రన్నర్స్ కప్, విజయపతకాలను సాధించారు.
 
ఈ ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 23, 24 తేదిలలో నిర్వహించబడ్డాయి. ఈ పోటిలలో 16 టీమ్స్ 4 పూల్స్‌గా విభజించబడి  6 మైదానాలలో 24 రౌండ్స్ నిర్వహించారు. సఫేద్ హాతి టీంకు చెందిన అర్జున్ ఆజబాని ఫైనల్స్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా, సెమి ఫైనల్స్‌లో ఫాల్కన్స్ టీంకు చెందిన వెంకి అడుసుమల్లి, సఫేద్ హాతికి చెందిన రంగనాథ్ కటారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేసారు. ఫైరేట్ టీంకు చెందిన విరాజ్ పటేల్ 63 పరుగులు 11 వికెట్స్ సాధించి ఇండియా టీం ప్లేయర్ రాబిన్ సింగ్ సంతకం చేసిన బాట్, ప్రత్యేక ట్రోఫీని సాధించారు. 
 
ఫైనల్స్ ముగిసిన తరువాత జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో 20వ తానా మహాసభల కన్వీనర్ నాదెండ్ల గంగాధర్ గారు విన్నర్ కప్, రన్నర్స్ కప్‌ను ఈ టీమ్స్‌కి అందచేసారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్‌మెన్ పతకాలను తానా సభల నిర్వహణ కార్యదర్శి శ్రీనివాస్ గోగినేని, కోశాధికారి నిరంజన్ శృంగవరపు , తానా రీజినల్ కో-ఆర్డినేటర్ జోగేశ్వరరావు పెద్దిబోయిన , కోర్ కమిటీ సభ్యులు రఘు రావిపాటి, సాగర్ మారంరెడ్డి, వెంకట్ పరుచూరి, సుధీర్ బజ్జు పతకాలను అందచేసారు.  డిట్రాయిట్ యువత పాల్గొన్న ప్రత్యేక పోటీలలో విన్నర్స్‌గా వెన్‌స్టేట్ కళాశాలల విద్యార్ధులు, రన్నర్స్‌గా డిటిఎ యువత నిలిచారు. 
 
ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ జాతీయ క్రికెట్ పోటీలకు అపూర్వ స్పందన లభించింది. విజయ్ తుము స్పోర్ట్స్ కమిటీ చైర్మెన్‌గా, రఘు రావిపాటి అడ్వైసర్‌గా, బంషి దేవాభక్తుని, చంద్ర అన్నవరపు కో-చైర్స్‌గా, వెంకట అడపా, విజు జుకరియా, వెంకట్ వాదనల, మయూర్, జగన్ కొండ, ప్రవీణ జట్టుపల్లి, జితేందర్ బొందడ కమిటీ సభ్యులుగా ఈ పోటీలు నిర్వహించారు. 
 
ఈ నెల 31 తేదిన తానా టెన్నిస్ పోటీలు, జూన్ 6వ తేదిన వాలీబాల్ పోటీలు నిర్వహింపబడతాయి. సిస్టర్ మోర్ట్ గేజ్, రిలయబల్ సాఫ్ట్‌వేర్ సంస్థలు స్పాన్సర్‌గా నిలిచారు. టీవీ9 వారు రెండు రోజులుగా జరిగిన క్రికెట్ జాతీయ పోటీలను చిత్రీకరించారు. ఇందుకుగాను తానా ఎలక్ట్రానిక్ మీడియా చైర్మెన్ సునీల్ పంత్రా సహకారాన్ని అందచేసారు. తానా ప్రెసిడెంట్ మోహన్ నన్నపనేని, తానా కన్వీనర్ నాదెండ్ల గంగాధర్ అధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి.దీనిపై మరింత చదవండి :