గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

శ్రీ మహావిష్ణును శనివారం అక్షింతలతో పూజించకూడదా?

శనివారం రోజున పరమేశ్వరునికి జిల్లేడు, గన్నేరు, మారేడు, తమ్మి, ఉత్తరేణు ఆకులు, జమ్మి ఆకులు, జమ్మి పువ్వులు మంచివని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మారేడు నందు శ్రీ మహాలక్ష్మీ దేవి, నల్ల కలువ యందు పార్వతీ దేవి, తెల్లకలువ యందు కుమార స్వామి వుంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతీ దేవి తెలజిల్లేడులో, బ్రహ్మ కొండ వాగులో, కరవీర పుష్పంలో గణపతి, శివమల్లిలో శ్రీ మహావిష్ణువు కొలువై వుంటారు.
 
సుగంధ పుష్పాలలో గౌరీదేవి వుంటారు. అలాగే శ్రీ మహావిష్ణును శనివారం అక్షింతలతోనూ, మహాగణపతిని తులసీతోనూ, తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవిని, మల్లెపువ్వులతో భైరవుడిని, తమ్మి పూలతో మహాలక్ష్మిని, మొగలి పువ్వులతో శివుడిని, మారేడు దళాలతో సూర్యభగవానుడిని ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.