శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (06:48 IST)

శనివారం (07-04-18) దిన ఫలితాలు - పాత్ర మిత్రులను కలుసుకుని...

మేషం : బంగారు, వెండి, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడితప్పదు. ఇతరులు మీ పట్ల ఆకర్షితులవు

మేషం : బంగారు, వెండి, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడితప్పదు. ఇతరులు మీ పట్ల ఆకర్షితులవుతారు. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది. అనుకున్నవి సాధించి ఎనలేని తృప్తిని పొందుతారు. 
 
వృషభం : చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. స్త్రీలకు బంధువుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పాత మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా గడుపుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. 
 
మిథునం : ఇతరుల వ్యవహారాలు, మొహమ్మాటాలకు దూరంగా ఉండండి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు. వ్యవసాయ రంగంలో వారికి వాతావరణంలో మార్పు సంతృప్తినిస్తుంది. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయంపొందండి. 
 
కర్కాటకం : కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు లాభిస్తాయి. పారితోషికాలు అందుకుంటారు. క్రీడల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగును. చిరు వ్యాపారులకు, చిన్నతరహా పరిశ్రమల వారికి అనుకూలం. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
సింహం : ఆకస్మిక ఖర్చులు తప్పనిసరి. చెల్లింపులు వల్ల ఇబ్బందులు తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. నిరుద్యోగులు, అవివాహితులు శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. కార్యసాధనంలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. 
 
కన్య : ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. షాపింగ్‌లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు చేసే పనులపై ఇతరుల దృష్టి ఉంటుంది. 
 
తుల : కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. కానీ, అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. ఊహించని అవకాశాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాలకు తగిన సమయం కాదు. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. 
 
వృశ్చికం : బ్యాంకులు, లావాదేవీలకు అనుకూలం. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు వస్తాయి. స్త్రీలకు నూతన పరిచయాలు, చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. కొబ్బరి, పానీయ, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. 
 
ధనస్సు : రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువును దక్కించుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఎదురు చూడకుండానే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పత్రికా సంస్థలోని వారికి విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. వాహనచోదకులకు జాగ్రత్త వహించాలి. 
 
మకరం : శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. కన్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. 
 
కంభం : స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. యాధృచ్చికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకుసాగండి. రవాణా రంగంలోని వారికి చికాకులు వంటివి ఎదుర్కొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి చేజారిపోయే ఆస్కారం ఉంది. 
 
మీనం : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మొండి బాకీలు వసూలు కాగలవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. హోటల్, బేకరీ, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.