గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

03-08-2020 సోమవారం రాశిఫలాలు - బంధు మిత్రుల సహాయం...

మేషం : ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విచ్చలవిడిగి వ్యయం చేస్తారు. 
 
వృషభం : స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. దైవ, దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సన్నిహితుల కోసం మీ పనులు వాయిదావేసుకోవలసి వస్తుంది. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనపర్చడంవల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు. 
 
మిథునం : సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం మీ ఉన్నతికి సహకరిస్తాయి. చేతి వృత్తి వ్యాపారాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, నేర్పుతో ఎంతో అవసరం. కొంతమంది మిమ్మలను తప్పుదోవ పట్టించి పొందడానికి యత్నిస్తారు. దైవ, సేవా పుణ్య కార్యాల్లో నిమగ్నమవుతారు. 
 
కర్కాటకం : గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులెదుర్కొంటారు. అయినవారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు. ఖర్చులకు సంబంధించి వ్యూహాలు అమలు చేస్తారు. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులు బిడియం కూడదు. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం మంచిది. 
 
సింహం : బంధుమిత్రుల రాకతో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. ముఖ్యుల కోసం షాపింగులు చేస్తారు. పత్రికా, ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు, వాయిదాపడతాయి. అనుక్షణం మీ సంతానం చదువు ఉద్యోగ విషయాలపై ఆలోచిస్తారు. నూతన పరిచయాలు, వ్యాపకాలు కొత్త ఉత్సాహం కలిగిస్తాయి. 
 
కన్య : బంగారు, వెడి, వస్త్ర వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి. సన్నిహితులతో మీ ఆర్థిక విషయాలను గురించి చర్చించవద్దు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
తుల : వృత్తుల్లో వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం. మీ పరోపకారబుద్ధి వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. 
 
వృశ్చికం : సమరయోధులకు ఆదరణ పురస్కారారాలు లభిస్తాయి. రుణ వ్యవహారాలలో వచ్చే ఒత్తిడిని తెలివిగా సరిచేయగలుగుతారు. ఊహించని ఖర్చులు అధికమవుట వల్ల ఆందోళనకు గురవుతారు. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. అధికారులక సాంస్కృతిక కార్యక్రమాలలో క్షణం తీరిక ఉండదు. 
 
ధనస్సు : ఆర్థికంగా నిలదొక్కుకోవడంతోపాటు రుణంలో కొంత మొత్తం తీర్చగలుగుతారు. ఉపాధ్యాయుల శ్రమకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగ విషయాల దృష్ట్యా తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన వ్యక్తులు సన్నిహితులవుతారు. విద్యార్థులు బహుమతులు, ప్రశంసలు అందుకుంటారు. 
 
మకరం : వృత్తిపరంగా ఎదురైనా ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. స్త్రీలకు ఆరోగ్యం పట్ల నిరక్ష్లంయ కూడదు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ప్రముఖుల విందు, వినోద వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
కుంభం : ఉద్యోగస్తులకు సన్మాన సభలు, యూనియన్ వ్యవహారాలలో క్షణం తీరిక ఉండదు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకో హాజరుకావడం మంచిది. వాక్చాతుర్యంతో అందరినీ సంతృప్తిపరుస్తారు. అదికారులు, తోటివారి నుంచి ప్రశంసలందుకుంటారు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకొని తప్పటడుగు వేస్తారు. 
 
మీనం : ఎదుటివారితో కుప్తంగా సంభాషించండి. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. సినిమా, విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సమర్థతకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన సంప్రదాయాలు పాటిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు.