శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

05-08-2020 బుధవారం రాశిఫలాలు - రాఘవేంద్ర స్వామిని పూజిస్తే...

మేషం : బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పనిభారం వంటి చికాకులు తప్పవు. నూతన పరిచయాలేర్పడతాయి. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మెళకువ వహించండి. మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. దైవదర్శనాలు, మొక్కబడులు అనుకూలిస్తాయి. 
 
వృషభం : ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. వాహనం నిదానంగా నడపండి. స్త్రీలు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా సమయానికి పూర్తికాగలవు. పారిశ్రామికవేత్తలకు కళ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. అందరితో వీలైనత క్లుప్తంగా మాట్లాడండి. 
 
మిథునం : వ్యాపార, ఉపాధి పథకాల్లో చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఇంటి అద్దెలు, పాత బకాయిలు వసూలు కాగలవు. బ్యాంకు పనులు, ప్రయాణాల్లో ఏకాగ్రత అవసరం. అధికారుల హోదా పెరగడంతో పాటు స్థానచలనం ఉంటుంది. గృహమార్పు వల్ల ప్రయోజనం ఉంటుంది. స్త్రీలకు షాపింగులో ఏకాగ్రత ముఖ్యం. 
 
కర్కాటకం : ఆధ్యాత్మిక విషయాలు, పుస్తకపఠనంతో కాలక్షేప్తం చేస్తారు. గృహ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. ఏజెంట్లు, బ్రోకర్లు, కలెక్షన్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావడం ఉత్తమం. 
 
సింహం : వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు అవకాశమివ్వండి. ఉద్యోగస్తులకు నగదు, బహుమతి, ప్రత్యేక ఇంక్రిమెంట్ వంటి శుభ ఫలితాలున్నాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం ఏర్పడతుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. బంధు మిత్రులు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. 
 
కన్య : ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయమే అన్ని విధాలా శ్రేయస్కరం. ధన వ్యయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో క్షణం తీరికవుండదు. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. 
 
తుల : రుణాలు, చేబదుళ్లు తప్పక పోవచ్చు. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు అధికం. ఆస్తి, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. సోదరీ సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
వృశ్చికం : వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. స్త్రీలకు అయినవారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు, సహచరులు, నూతన వాతావరణానికి క్రమంగా అలవాటు పడతారు. 
 
ధనస్సు : పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. విద్యార్థినులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మెళకువ అవసరం. 
 
మకరం : కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులు తప్పవు. సర్దుబాటు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. ఫ్లీడరు నోటీసులకు ధీటుగా స్పందిస్తారు. భేషజాలకు పోకుండా ఇతరుల సహాయాన్ని స్వీకరించిండి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. 
 
కుంభం : అధికారుల సుదీర్ఘ సెలవుతో ఉద్యోగస్తులు నిశ్చింతకు లోనవుతారు. అనుభవజ్ఞులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలపై ఆసక్తి మరింతగా పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. 
 
మీనం : నేడు అనుకూలించని వ్యవహారం రేపు సానుకూలంకాగలదు. తొందరపాటుతనం వల్ల ధననష్టంతో పాటు మాటపడవలసి వస్తుంది. పెద్దలు, మీ శ్రీమతి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాలు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాకయంగా ఉంటుంది.