శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

12-05-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే..

మేషం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థికపరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. కార్యసాధనలో ఓర్పు, నేర్పు, పట్టుదల అవసరం. ఖర్చులు విషయంలో ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. 
 
వృషభం : స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. ఒక చిన్న విహార యాత్రలు చేస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. 
 
మిథునం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. స్త్రీలకు బంధువర్గాలు, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు, అధికారుల ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
కర్కాటకం : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు కలిసిరాగలదు. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు స్థానమార్పిడికై చేయుయత్నాలు వాయిదాపడతాయి. ఉమ్మడి వెంచర్లు, సంస్థల స్థాపనలో పునరాలోచన అవసరం. విద్యార్థుల్లో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
సింహం : తొందరపాటుతనంవల్ల ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. విద్యార్థులకు దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. 
 
కన్య : ఆర్థికంగా మెరుగుపడతారు. ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. 
 
తుల : విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వామిక వ్యాపారాల్లో మీ ఆధిపత్యానికి భంగం కలుగవచ్చు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం తప్పదు. మార్కెటింగ్, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. ఎదుటివారి వ్యాఖ్యలు మీపై తీవ్రంగా పనిచేస్తాయి. 
 
వృశ్చికం : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఉద్యోగస్తులు చిక్కుల్లో పడతారు. ఇతరులకు పెద్ద ఎత్తు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం మంచిదికాదు. 
 
ధనస్సు : భూములు, స్థలాలు, కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలు బంధువుల రాకతో అనుకున్న పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు అన్ని విధాలా కలిసిరాగలదు. కోర్టు పనులు వాయిదాపడం మంచిదని గమనించండి. ఖర్చులు అధికమవుతాయి. 
 
మకరం : ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండివైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో మంచి ఫలితాలుంటాయి. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఉంటుంది. పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారం అవుతాయి. 
 
కుంభం : స్త్రీలకు ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. బంధువులు మీ నుంచి ధనం లేక ఇతరాత్రా సహాయం అర్థిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. క్రయ విక్రయాలు ఆశించినంత సంతృప్తినీయజాలు. రావలసిన బకాయిలు ముందు వెనుకలుగానైనా అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. 
 
మీనం : మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. గృహోపాకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి.