శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (16:04 IST)

13-02-2019 - బుధవారం రాశి ఫలితాలు.. అక్షర దోషాలు తలెత్తకుండా?

మేషం: రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కుటుంబ సమస్యలు, బంధుమిత్రులతో పట్టింపులు తొలగుతాయి. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. నూతన వ్యాపారాల్లో ఒడిదుకులెదురైనా అధికమిస్తారు. పాత బిల్లులు చెల్లిస్తారు. 
 
వృషభం: దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు మాని ఏకాగ్రతతో పనిచేయడం శ్రేయస్కరం. స్థిరచరాస్తుల విషయంలో ఏకీభావం కుదరదు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మిధునం: గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.  ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. స్త్రీలకు కళ్లు, తల, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించడం వలన కొన్ని పనులు సానుకూలమవుతాయి.
 
కర్కాటకం: నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. విద్యార్థుల అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సత్ఫలితాలిస్తాయి. బంధువులను కలుసుకుంటారు.
 
సింహం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. నిర్మాణ కార్యక్రమాలలో ప్రోత్సాహం లభిస్తుంది. టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. 
 
కన్య: కిరాణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. బ్యాంకు పనులు త్వరితగతిన పూర్తికాగలవు. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలు అపరిచితులను అతిగా విశ్వసించడం వలన ఆశాభంగానికి గురికాక తప్పదు. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు.  
 
తుల: విద్యార్థులకు ఒత్తిడి, అవిశ్రాంతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ చాలా అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు వాయిదా పడుతాయి. ఇతరుల వాహనం నడపడం వలన అనుకోని ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. షేర్ మార్కెట్ రంగాలవారికి మెళకువ అవసరం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలు ఎదుర్కుంటారు.  
 
ధనస్సు: కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరం చేస్తారు. దూరప్రయాణాలలో కొత్త పరిచయాలేర్పడుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. పెద్దలను నుండి అవమానాలు తప్పవు. రుణం తీర్చడానికై చేయు యత్నం వాయిదా పడుతుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. 
 
మకరం: నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది. ఎంతటి సమస్యనైనా ధైర్యంతో ఎదుర్కుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
కుంభం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఒకేసారి అనేక పనులు మీదపడడంతో అసహానానికి లోనవుతారు. ప్రయాణాలను ఆకస్మికంగా వాయిదా వేస్తారు.    
 
మీనం: ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. ఏ విషయంలోను ఇతరులను అతిగా విశ్వసించడం మంచిది కాదని గమనించండి. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. సోదరీసోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడుతాయి.