14-05-2019 మంగళవారం దినఫలాలు

రామన్| Last Updated: మంగళవారం, 14 మే 2019 (08:42 IST)
మేషం: మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ లోటుపాట్లు, తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెంటాడుతుంది.

వృషభం: ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. దైవ సేవా కార్యక్రమాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువును దక్కించుకుంటారు.

మిథునం: బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాసం వుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మిత్రుల కలయికతో మనసుకుదుటపడుతుంది. స్త్రీలు ఆదాయంపై, ధన సంపాదనపై మరింత దృష్టి పెడతారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు.

కర్కాటకం: ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు. టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి లాభదాయకం. స్థిరాస్తుల అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడటం మంచిది.

సింహం: నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రియతముల రాక మీకెంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ఓర్పు, చాకచక్యంతో చిక్కు సమస్యలను సరిచేసుకుంటారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.

కన్య: ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మిత్రులపై మీరు పెట్టుకున్న ఆశలు ఆడియాసలయ్యే సూచనలున్నాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వటం మంచిది కాదు.

తుల: పోస్టల్, ఎల్ఐసి ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. సోదరీ సోదరుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలకు విఘాతం కలిగే అవకాశం వుంది. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాల్లో మంచి మంచి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులు అధికారులకు మరింత సన్నిహితులవుతారు. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల జోక్యం అనివార్యమవుతుంది. మధ్య మధ్యలో ఔషధ సేవ తప్పకపోవచ్చు.

ధనస్సు: కిరాణా, ఫ్యాన్సీ, మందులు, పానీయ, ఆల్కహాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తుంది. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం: స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం వుంది. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.

కుంభం: మీలో వచ్చిన మార్పు మీ శ్రీమతికి సంతోషం కలిగిస్తుంది. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు శ్రద్ధగా చేయాల్సి వుంటుంది. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిది కాదు.

మీనం: స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. మిత్రులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. నూతన పెట్టుబడులకు కావలసిన వనరులు, అనుమతులు సమకూర్చుకుంటారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.దీనిపై మరింత చదవండి :