సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

15-05-2020 శుక్రవారం దినఫలాలు - సరస్వతిదేవిని ఆరాధించిన...

మేషం : ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. వాగ్వివాదాలకు దిగి ససమస్యలు కొని తెచ్చుకోకండి. బంధువుల రాకతో గృహంలో కొంత అసౌకర్యానికి గురవుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. 
 
వృషభం : ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరని గమనించండి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. సోదరీ, సోదరుల నుంచి చికాకుల తప్పవు. 
 
మిథునం : ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ధనం ప్రాముఖ్యత, పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. స్త్రీలకు ఉదరం, మోకాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. 
 
కర్కాటకం : ఎంతో శ్రమించినమీదట కాని అనుకున్నది సాధించలేరు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు దూరప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. పై అధికారుల నుంచి విమర్శలు తప్పవు. 
 
సింహం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి తరచూ యాజమాన్యం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు, దైవకార్యాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. 
 
కన్య : ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తికానవస్తుంది. సాంఘిక, శుభకార్యాలలో మీరు మంచి గుర్తింపు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. 
 
తుల : చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ సంకల్ప బలానికి సన్నిహితుల సహాయం తోడవుతుంది. కుటుంబీకులతో కలిసి విందులలో పాల్గొంటారు. పెరిగిన ఖర్చులు, ఇతరత్రా అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి. గృహం ఏర్పరచుకోవాలనే కోరిక నెరవేతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. 
 
వృశ్చికం : ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. పండ్లు, కొబ్బరి, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు విషయంలో కొన్ని ప్రతికూలతలు ఎదరువుతాయి. 
 
ధనస్సు : స్త్రీలు శుభకార్యాల్లో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రయాణాలలో మెళకువ వహించండి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు పెరగడంతో రుణాలు, చేబదుళ్లు తప్పవు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటాయి. 
 
మకరం : ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగస్తులు స్వల్ప ఆటంకాలను, ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. 
 
కుంభం : వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రావలసిన ధనం అందడంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు సంతృప్తి, పురోభివృద్ధి. 
 
మీనం : మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. మీ సంతానం ఆహార, ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది.