శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (10:08 IST)

16-02-2019 - శనివారం మీ రాశి ఫలితాలు - మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే...

మేషం: ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. అపరిచిత వ్యక్తులను దూరంగా ఉంచడం మంచిది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో మెలకువలు గ్రహిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయాలలో వారికి అభిమానబృందాలు అధికమవుతాయి. ధనం ఏ కొంతయినా సద్వినియోగం అవుతుంది.
 
వృషభం: శారీరక శ్రమ, మానసికాందోళన వలన స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పోస్టల్, ఎల్‌ఐసి ఏజెంట్లకు ఒత్తిడి, త్రిప్పట అధికం. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు పనివారితో చికాకులు వంటివి ఎదుర్కుంటారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది.  
 
మిధునం: ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. దుబారా ఖర్చులు అధికం. 
 
కర్కాటకం: మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా అనుకున్న రీతిలో పూర్తిచేస్తారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.  
 
సింహం: వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. 
 
కన్య: కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. మిత్రులను కలుసుకుంటారు. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బంది పడుతారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. క్రయవిక్రయ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం తక్కుతుంది. బంధువుల రాకవలన గృహంలో అసౌకర్యానికి లోనవుతారు.
 
తుల: దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ముక్తసరిగా సంభాషిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో పూల, కొబ్బరి వ్యాపారులకు ఆశాజనకం. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.  
 
వృశ్చికం: ఆంతరంగిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. మీరు చేపట్టిన పనిలో ఆటంకాలను ఎదుర్కొన్నా జయం మిమ్మల్ని వరిస్తుంది. నిరుద్యోగులకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసివస్తుంది. 
 
ధనస్సు: మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విచ్చల విడిగా వ్యయం చేస్తారు. ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియారూపంలో పెట్టిన జయం చేకూరగలదు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ పాత సమస్యలు ఒకంతట తేలకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. 
 
మకరం: ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి. ప్రతిపని చేతిదాకా వచ్చి వెనక్కి పోవడం వలన నిరుత్సాహం, ఆవేదనకు లోనవుతారు. స్త్రీలు అపరిచితుల వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. దూరప్రాంతలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో కలిసి సంప్రదింపులు జరుపుతారు.   
 
కుంభం: రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. తొందరపడి సంభాషించడం వలన ఇబ్బందులకు గురికాక తప్పదు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి చేకూరుతుంది. 
 
మీనం: నిరుద్యోగులో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ఐరన్, సిమెంట్, కలప, వ్యాపారస్థులకు అనుకూలం. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. విద్యార్థులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.