శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : గురువారం, 16 మే 2019 (09:05 IST)

16-05-2019 రాశిఫలాలు : దత్తాత్రేయుడుని ఆరాధించిన సంకల్పసిద్ధి

మేషం : ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందడంతో ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ పట్టుదల నెరవేరుతుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషాల వల్ల చికాకులు తప్పవు. 
 
వృషభం : బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. బంగారు, వెండి, వస్త్ర వ్యాపార రంగాల వారికి మెళకువ అవసరం. ఆదాయ వ్యయాలు సంతృప్తిగా సాగుతాయి. 
 
మిథునం : ఓర్పు, శ్రమాధిక్యత అనుకున్న కార్యాలు నెరవేరగలవు. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. భాగస్వామికులతో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడవలసి వస్తుంది. విదేశాలలో ఉన్న ఆత్మీయులకు వస్తు సామాగ్రిలు అందజేస్తారు. 
 
కర్కాటకం : ఆడిటర్లు అసాధ్యమనుకున్న కేసులు సునాయాసంగా పరిష్కరిస్తారు. హమీలకు, అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండటం వల్ల మేలు చేకూరుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికిమాటికి అసహనం ఎదుర్కొంటారు. 
 
సింహం : ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దైవ కార్యాక్రమాలలో పూర్తిగా నిమగ్నులౌతారు. ఆత్మీయుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ప్రైవేటు సంస్థలలోని వారి సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కన్య : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధికమిస్తారు. భార్యా, భర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. కుటుంబ సమస్యలు, రుణ బాధలు పరిష్కారమవుతాయి. 
 
తుల : బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సఖ్యత అంతగా ఉండదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. 
 
వృశ్చికం : నూతన ప్రదేశాల సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యులతో ఏర్పడిన పరిచయాలు, మీ హోదా, పరపతిని పెంచుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. 
 
ధనస్సు :  బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. కిరాణా, మందులు, ఆల్కహాలు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. వైద్య ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి కలిసిరాగలదు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అసహనానికి గురవుతారు. 
 
మకరం : అవివాహితులతో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. స్త్రీలు నూతన పరిచయస్తుల విషయంలో అప్రమత్తంగా మెలగడం క్షేమదాయకం. నిరుద్యోగుల యత్నాలు ఫలించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. విలువైన వస్తువులు, పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. 
 
కుంభం : హోటల్, తినుబండరాలు, కేటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కుటుంబీకుల తీరు ఆందోళన కలిగిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. ఖర్చులు అదుపు చేయాలనే మీ యత్నాలు అనుకూలించవు. 
 
మీనం : సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు కలిసిరాగలదు. మీ శ్రీమతి అభిప్రాయాలకు విలువనిస్తారు. ఏ విషయంలోనూ తొందరపడక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. స్త్రీలు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం.