శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

16-05-2020 శనివారం దినఫలాలు - సత్యదేవుడిని పూజిస్తే...

మేషం : ఆధ్యాత్మిక, యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు పట్ల ఏకాగ్రత వహించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
వృషభం : మిర్చి, నూనె, పసుపు, చింతపండు స్టాకిస్టులకు, రిటైల్ వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులు అదికారులను తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి చికాకులు తప్పదు. దూర ప్రయాణాలు చేయు వారికి వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. 
 
మిథునం : ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. ప్రైవేటు సంస్థల వారికి, ఏజెంట్లకు బ్రోకర్లకు ఆశించినంత సంతృప్తికానరాదు. ఖర్చులు అధికమైనా ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు. బంధు మిత్రుల నుంచి విమర్శలు, వ్యాఖ్యానాలు అధికమవుతాయి. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు తల, కళ్లు, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. కొంతమంది మీ నుంచి ధన, వస్తు సహాయం ఆశించవచ్చు. ఇతరుల వాహనం నడపడం వల్ల ఇబ్బందులకు గురికావలసి వస్తుంది. 
 
సింహం : మీ పెట్టుబడులకు మంచి స్పందన లభించడంతో మీలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ముందు వెనుకలుగానైనా మీరు చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తికాగలవు. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికిరాగలవు. 
 
కన్య : వ్యాపారస్తులకు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులు తమ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టిన పురోభివృద్ధి కానరాగలదు. స్త్రీలలో దాగియున్న రచనా పటిమకు, కళాత్మతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. 
 
తుల : పారిశ్రామిక రంగంలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ముఖ్య విషయాల్లో కుటుంబీకుల మధ్య ఏకీభావం కుదరదు. వృత్తుల వారు ఆందోళనకు గురవుతారు. ఉద్యోగస్తుల మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు. కంది, మినుము, మిర్చి, బెల్లం, చింతపండు స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఉద్యోగయత్నాలు ఒక కొలిక్కి రావడంతో మీలో కొత్త ఉత్సాహం కానరాగలదు.
 
ధనస్సు : బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం సకాలంలో అందడం వల్ల సమస్యల నుంచి బయటపడతారు. స్త్రీల ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతుంది. రాజకీయాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
మకరం : ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీ పట్టుదల అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. హోటల్, తినుబండరారాలు, క్యాటరింగ్ పనివారలకు ఒత్తిడి, చికాకులు అధికం. నిర్మాణ పనులలో పనివారితో లౌక్యంగా వ్యవహరించండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
కుంభం : గృహమునకు కావలసిన వస్తువులు సమకూర్చుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి. ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య ఆల్కహాలు వ్యాపారులకు పురోభివృద్ధి. ఊహించని దుబారా ఖర్చులు అధికం. 
 
మీనం : వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులవుతారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతరుల విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు తోటివారి మాట, ధోరణి కారణంగా మానసిక ఆందోళన చెందుతారు.