శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (15:35 IST)

చెవి వెనుక భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?

పుట్టుమచ్చలు అనగా అందం. కొందరైతే శరీరంలో పుట్టుమచ్చలు ఎక్కువగా ఉన్నాయని వాటి తొలగిస్తుంటారు. అలా చేసినప్పుడు కొన్ని రోజులపాటు అనారోగ్యాలతో సతమతమవుతుంటారు. దాంతో పలురకాల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవలసి వస్తుంది. అంతేకాకుండా వీటిని తొలగిస్తే దోషాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు చెప్తున్నారు. మచ్చలోని ప్రాధాన్యతలు, విశిష్టతలు తెలుసుకుంటే ఇలాంటివి ఎప్పుడూ చేయాలనిపించదు. అవేంటో తెలుసుకుందాం..
     
చెవుల మీద మచ్చ ఉన్నచో వారు సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతి గలవారై ఉంటారు. మాట పలుకుబడితనం కలిగియుంటారు. విశేషమైన కీర్తీప్రతిష్టలు గలవాడు. వీరు చెవులకు భూషణములు లభిస్తాయి. అలానే కుడి చెవి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నచో వారు ఆస్తిపరులై యుంటారు. చెవికి మధ్య భాగంలో మచ్చ ఉన్నచో వారు దైవభక్తి, పురాణపఠన భక్తి కలిగియుందురు. 
 
ఎడమ లేదా కుడి చెవి వెనుకభాగంలో మచ్చ ఉంటే.. వారు దీర్ఘ ఆయుష్షు గలవారు. అందరి ప్రసంసలు పొందుతారు. మంచి గుణవతియైన భార్యను పొందుతారు. వీరి ఇంట్లో ఎల్లప్పుడూ సిరిసంపదలు వెల్లువిరుస్తుంటాయని పురాణాలలో స్పష్టం చేశారు. అంతేకాకుండా పిత్రార్జిత ధన భూగృహములు కలవాడు. చెవి లోపలి భాగంలో మచ్చ ఉన్నచో, వారికి భోగభాగ్యాలు లభిస్తాయి. కర్ణభూషణములు కలవారు. నిత్యం మంగళ వాద్యాలతో దేవతార్చనలు చేస్తుంటారు.