శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (13:38 IST)

చేతికి ఆ భాగంలో పుట్టుమచ్చ ఉన్నచో..?

పుట్టుమచ్చలు అనేవి సహజంగా ప్రతి మనిషిలో ఉండేవే. కానీ, చాలామంది పుట్టుమచ్చలు ఉన్నా కూడా వాటిని తీయించేస్తున్నారు. అలా చేయడం వలన జీవితంలో అన్నీ కోల్పోతారు. అంతేకాకుండా పలురకాల అనారోగ్య సమస్యలకు గురవుతారు. పుట్టమచ్చ అనేది మనం పుట్టినప్పడు మన తోడుగా వస్తుంది. పుట్టుమచ్చ ధైర్యాన్ని సమకూర్చడానికే శరీరంపై ఓ మచ్చగా ఏర్పడుతుంది. మరి ఆ ధైర్యాన్ని మన చేతులారా మనమే వదలుకోవడం అనార్థదాయకం. పుట్టుమచ్చలోని విశిష్టతలు తెలుసుకుంటే.. ఎవ్వరికీ వాటిని తీయించేయాలనిపించదు.
 
చేతి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉన్నచో వారికి ధనధాన్యాలు చేకూరతాయి విశ్వాసం. అంతేకాదు.. వారి దైవ భక్తిగలరై అందరి మన్ననలను పొందుతారు. తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తిచేస్తారు. వారి మనసులు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. చేతి చివరి భాగంలో పుట్టుమచ్చ ఉన్నచో వారు రాజకీయాల్లో రాణిస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు.
 
ఇక కంటి కింది భాగంలో మచ్చ ఉన్నచో వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. అంతేకాకుండా వారికి జీవితంలో ఎలాంటి కష్టాలుండవు. నాలుకు పైభాగంలో పుట్టుమచ్చ ఉన్నచో వారు ఏది చెప్పినా అది తప్పకుండా జరుగుతుంది. వీరు అబద్ధాలు కూడా ఎక్కువగా చెప్తారు. కనుక జాగ్రత్త వహించండి.