శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (14:46 IST)

కంటికి ఎడమ భాగాన మచ్చ ఉంటే.. వారు..?

పుట్టుమచ్చ ప్రతీ మనిషిలో తప్పకుండా ఉంటుంది. ఈ మచ్చలు ఒక్కోసారి మంచి చేసినా ఒక్కోసారి చెడు ఆలోచనలకు నాంది పలుకుతాయి. ఇలాంటి మచ్చలు కంటి భాగంలో ఉంటే.. ఏం జరుగుతుందో.. ఆ ప్రాంతాల్లో ఉండడం వలన ఎలాంటి ఫలితాలు లభిస్తాయనే విషయాన్ని ఓసారి తెలుసుకుందాం...
 
కంటి కొనయందు పుట్టుమచ్చ శాంతము, స్థిరస్వభావము, బలవస్మరణమును కలుగజేయును. కంటినీరు పడుప్రాంతంలో పుట్టుమచ్చ ఉన్నచో సంతాన నష్టము కలుగును. దరిద్రుడగును. 
 
కుడికంటియందు నల్లగ్రుడ్డునకు కుడివైపున మచ్చ ఉన్నచో విశేష ధనవంతుడగును. గొప్ప వారితో పరిచయాలు లభించును. గ్రుడ్డునకు ఎడమభాగమున మచ్చ ఉన్నచో సదాచారసంపన్నుడును, పెద్దల యందు భక్తి విశ్వాసములు కలవాడును, ధనవంతుడైన మిత్రులు కలవాడును, సమయోచితముగ మాట్లాడువాడును, విశేష ధనార్జనాపరుడగును.
 
ఎడమకన్ను గ్రుడ్డునకు కుడిభాగాన పుట్టుమచ్చ ఉంటే ధనార్జనాపరుడును, ఆర్జించిన ధనమును వ్యయం చేయువాడును, పరస్త్రీలను కోరువాడగును. ఎడమకన్ను గ్రుడ్డునకు ఎడమ భాగమున మచ్చ ఉన్నచో వ్యభిచారమూలమున పిత్రార్జితము సంతయు పోగొట్టువాడును, బంధువిరోధియగును.