సంకష్ట హర చతుర్థి.. వినాయకుడిని ఇలా పూజిస్తే.. కష్టాలన్నీ మటాష్
సంకష్ట హర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గురువారం ఉదయం స్నానం చేసి వినాయకుడిని పూజించి ఉపవాసం ప్రారంభించవచ్చు. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి గణేశ పూజలో పాల్గొనవచ్చు.
ఇంట్లో వినాయకుడిని పూజించే వారు, ఇంట్లో ఇప్పటికే వినాయక విగ్రహం లేదా చిత్రం ఉంటే పూజలు చేయవచ్చు. ఈపై వినాయక అష్టోత్తరాలను పఠించాలి. గరికతో పూజ చేయాలి. బెల్లం, మోదకాలు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ రోజున వినాయక స్వామి దర్శించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయి.
భక్తిశ్రద్ధలతో వినాయకునికి పూజలు చేస్తే.. అభిషేక ఆరాధనలను చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. చంద్రునికి పొంగలి నైవేద్యంగా సమర్పిస్తే సర్వ శుభాలు చేకూరుతాయి.
సంకష్ట హర చతుర్థి రోజు దీపారాధన దర్శనం చేసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి. వరుసగా 9 సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడి ఆలయాన్నిదర్శించుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.