సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (16:10 IST)

సర్వ అమావాస్య.. మిగిలిన ఆహారం తీసుకోవద్దు..

సర్వ అమావాస్యకు చేయవలసినవి.. చేయకూడనివి ఏవో ఒకసారి పరిశీలిద్దాం.. నల్ల నువ్వులు మన పూర్వీకులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి తగినవిగా భావిస్తారు. అలాగే శ్రాద్ధం చేసే వ్యక్తి తెల్లని దుస్తులు ధరించాలి.
 
ఎల్లప్పుడూ పూర్వీకులకు సువాసనగల పువ్వులను సమర్పించాలి. ముఖ్యంగా గులాబీ లేదా తెలుపు-రంగు సువాసనగల పువ్వులను చేర్చాలి. ఎల్లప్పుడూ నది లేదా సరస్సు ఒడ్డున పిండప్రదానం చేయాలి.
 
ఈ రోజున మద్యపానం, మాంసాహారం తీసుకోకూడదు. ఇంకా బ్రాహ్మణులకు అన్నదానం, కూరగాయలు దానం చేయడం మంచిది. 
 
ఇంకా మాంసాహారం, ఆవాలు, బార్లీ, జీలకర్ర, ముల్లంగి, నల్ల ఉప్పు, పొట్లకాయ, దోసకాయ, మిగిలిన ఆహారం తీసుకోకపోవడం మంచిది. సర్వపితృ అమావాస్య నాడు ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపాలి.