శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (15:20 IST)

శనిదోషాలు తొలగిపోవాలంటే.. నల్ల ఆవుకు బెల్లం, నువ్వులు తినిపిస్తే? (video)

శనిదేవునికి నలుపు రంగు ప్రీతికరమైనది. ఆయన వాహనం కాకి. అందుచేత శనివారం పూట తీపి పదార్థాలను ఆహారంగా ఇవ్వాలి. ముఖ్యంగా నల్ల చీమలు ఎక్కడ వున్నా వాటికి ఆహారంగా పంచదార వేయాలి. ఇంకా నల్ల ఆవులు, నల్ల శునకాలకు ఆహారం అందించడం ద్వారా శనిదోష ప్రభావం తగ్గుతుంది. 
 
ఇంకా శనివారం శివాలయంలో నేతితో దీపమెలిగించడం.. నవగ్రహాల్లో శనీశ్వరుడినికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడంతో శని దోషాలు తొలగిపోతాయి. ''శ్రీ రామ జయ రామ జయ జయ రామ'' అని ఎప్పుడు మనస్సులో స్మరించుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం వలన ఎంతో మంచి జరుగుతుంది.
 
శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా శనిదోషాలుండవు. తలిదండ్రుల సేవలు చేస్తూ, కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం చేయాలి.  నల్ల ఆవుకు బెల్లం, నువ్వుల మిశ్రమాన్ని తినిపిస్తే.. శనిదోషాలు తొలగిపోతాయి. శనివారాల్లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి. కాకులకు ఉదయం, మధ్యాహ్న వేళల్లో అన్నం పెట్టాలి.
 
బెల్లంతో చేసిన రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా తుంచి కాకులకు వేయాలి. వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి. పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆ తరువాత కాకులకు పెట్టాలి. అనాథ బాలలకు అన్నదానం చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.