మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (22:48 IST)

మంగళవారం సుందరకాండ పారాయణం చేస్తే?

Hanuman
మంగళవారం సుందరకాండ పారాయణం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంకా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం పూర్తి చేయాలి. అనంతరం ధ్యానం ప్రారంభించాలి. 
 
సుందరకాండ పఠించడానికి ఉదయం 5.30 గంటల్లోపే గల సమయం ఉత్తమం. సుందరకాండ పారాయణానికి ముందు వినాయకుడిని పూజించాలి. ఇలా సుందరకాండ పారాయణం చేసిన ప్రతి ఒక్కరికీ సానుకూల ఫలితాలొస్తాయి. 
 
మంగళవారం రోజున మీ దగ్గర్లోని హనుమంతుడి ఆలయానికి వెళ్లి రామనామం జపించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సంక్షోభాలన్నీ తొలగిపోతాయి.