మంగళవారం దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే..
సకల కార్యజయం కావాలంటే హనుమాన్‌ను అర్చించాలి. అదేవిధంగా గ్రహపీడా నివారణకు ఆంజనేయుడ్ని కొలవాలి. ఇక ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు, జన్మ సమయంలోని దోషాలు పోవడానికి హనుమంతుడిని ఆరాధిస్తే చాలు. సాక్షాత్ రుద్రుడు కాబట్టి అన్ని దోషాల నివారణ ఆయన నామస్మరణ, అర్చన ద్వారా పోతాయని శాస్ర్తాలు చెపుతున్నాయి.
పిల్లలు పుట్టడానికి ఉన్న గ్రహదోషాలు, నవగ్రహ దోషాలు అదేవిధంగా కార్యల్లో ఆటంకాలు, భయం పోవడానికి సుందరాకాండ పారాయణం చాలా ప్రశస్తి. అవకాశాన్ని బట్టి సుందరాకాండ పారాయణాన్ని చేయించుకుంటే సకల దోషాలు పోయి సర్వకార్య జయం కలుగుతుంది.
మంగళవారం దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే.. పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి, ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్ర్తాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా శుభ ఫలితాలు పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.