సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మే 2022 (20:26 IST)

గరుడ దర్శనంతో శుభ ఫలితాలేంటి? కలలో పాములు కనిపిస్తే?

Garuda
Garuda
గరుడ దర్శనానికి వెయ్యి శుభ శకునాలకు సమానం. గరుడ దర్శనం అసమానమైనది. గరుడను పూజించడం వల్ల పాపం తొలగిపోతుంది. చర్మవ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నాగదోషం తొలగిపోతుంది. 
 
గరుడ పూజతో తెలియని పాపాలు తొలగిపోతాయి. వివాహిత స్త్రీలు గరుడ పంచమి రోజున గరుడను పూజిస్తే, పిల్లలు వివేకవంతులు, ధైర్యవంతులు అవుతారు. చెడు శకునాలు, దుష్ట శక్తుల కర్మలు వగైరా అన్నీ గరుడ దర్శనం ద్వారా సూర్యుడిని చూసిన మంచులా కరిగిపోతాయి
 
గరుడ భగవానుని దర్శనం చేసుకోవడం ద్వారా హృదయంలో ఉత్తేజం, ఉత్సాహం లభిస్తుంది. తరచుగా పాములు కలవడం, పీడకలలు, అసమంజసమైన భయం మొదలైన వాటితో బాధపడేవారు గరుడ పంచమి ఉపవాసాన్ని చేపట్టవచ్చు.
 
దీర్ఘ సుమంగళి ప్రాప్తం కోసం స్త్రీలు గరుడుడిని ప్రార్థించడం చేయాలి. గరుడుడిని పూజించడం ద్వారా గొప్ప భక్తి, స్మృతి శక్తి, వేదాంత జ్ఞానం, వాక్చాతుర్యం లభిస్తుందని ఈశ్వర సంహిత అనే గ్రంథం వివరిస్తుంది. గరుడ దండకాన్ని పఠించడం ద్వారా మానసిక రోగం, అపానవాయువు, గుండెజబ్బులు, నయం కాని విష వ్యాధులు నయమవుతాయని చెప్పబడింది.