శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:56 IST)

శివనామాన్ని స్మరిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

పరమేశ్వరుడు మహా దయా సాగరుడు. ఈ స్వామివారిని ప్రేమతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తే చాలు కరుణతో కరిగిపోతాడు. అభిషేకాలు చేస్తే చాలు కోరిన వరాలను తప్పకుండా ప్రసాదిస్తాడు. భక్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా శి

పరమేశ్వరుడు మహా దయా సాగరుడు. ఈ స్వామివారిని ప్రేమతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తే చాలు కరుణతో కరిగిపోతాడు. అభిషేకాలు చేస్తే చాలు కోరిన వరాలను తప్పకుండా ప్రసాదిస్తాడు. భక్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా శివ నామాన్ని స్మరిస్తే చాలు స్వామివారు ప్రీతి చెందుతారు. శివనామ మహిమ అపారమని పురాణాలలో చెప్పబడింది.
 
శివనామ స్మరించడం వలన ముక్తి లభిస్తుందని చెబుతున్నారు. శి అంటే మంగళం, వ అంటే అనుగ్రహంచేవారని అర్థం. ఎవరైతే పాపాలతో బాధపడుతున్నారో వారు శివనామ స్మరిస్తే చాలా వెంటనే పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా సమస్త దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది. అలానే కాశీ క్షేత్రంలో శరీరాన్ని విడిచిపెట్టిన వారికి కలిగే ముక్తి శివ నామాన్ని స్మరించేవారికి కూడా కలుగుతుందని పరమేశ్వరుడే పార్వతీ దేవికి చెప్పారు.