గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 21 జనవరి 2020 (20:28 IST)

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

శ్రీమాన్ కృపాజలనిధే కృత సర్వలోక
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్
స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ||
 
శ్రీ వేంకటేశ్వర స్వామీ, నీవు భాగ్యవంతుడవు. దయా సముద్రడవు. సర్వ లోకాలకూ కర్తవు. సర్వమునూ తెలిసినవాడవు. సామర్థ్యము కలవాడవు. సర్వ ప్రపంచానికి ఆధారభూతుడవు. గుణవంతులకు సులభసాధ్యుడవు. ఓ ప్రభూ, నీ పాద పద్మములను నేను శరణు కోరుతున్నాను.