శుక్రవారం, 9 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : బుధవారం, 12 నవంబరు 2014 (17:42 IST)

మిమల్ని మీరు ప్రేమించుకుంటే.. విజయం సాధ్యమే!

తమల్ని తాము ప్రేమించుకుంటే.. విజయం సాధ్యమేనని మానసిక నిపుణులు అంటున్నారు. తమ గురించి పట్టించుకోని వారు చాలా సందర్భాల్లో ప్రతికూలంగా ఆలోచిస్తారు. దాంతో ఏ పనీ ఆత్మవిశ్వాసంతో చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. దాంతో విజయం వరించదు. అందుకే ఎవరిని వారు ప్రేమించుకోవాలి. 
 
ఎవరిని వారు ప్రేమించుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. పోటీ గురించి పెద్దగా పట్టించుకోరు. ఇతరుల గురించి ఆలోచించరు. ఇతరులు విమర్శించినా తమ సామర్థ్యంపై గల అవగాహనతో లైట్‌గా తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 
 
ఇలా మీపై నమ్మకాన్ని పెంచుకుంటూ మీలో ఉన్న లోపాలను కూడా గమనించండి. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అంటున్నారు.. సైకాలజిస్టులు.