శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:08 IST)

రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరిస్తే..?

పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, శుభ్రపరిచిన వాకిలి, ద్వారం, గోవులు.. ఇవన్నీ లక్ష్మీ రూపాలే. దేవతారాధన, శుచి, శుభ్రత ఇళ్లల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటారు. లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు ఉన్న ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంది. అసలు లక్ష్మీదేవి ఎటువంటి ఇండల్లో నివాస ఉంటారో.. ఏఏ పనుల వలన భాగ్యలక్ష్మీ ఆయా గృహాలను వీడి వెళ్లిపోతుందో తెలుసుకుందాం..
 
1. ప్రాతఃకాల సంధ్యలో, సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇండ్లల్లో లక్ష్మీదేవి ఉండదు. పెద్దలను గౌరవించే గృహంలో, సహనం కల స్త్రీలు ఉండే ఇండ్లల్లో లక్ష్మీదేవి ఉంటారు.
 
2. రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరిస్తే.. లక్ష్మీ వెళ్లిపోతుంది. ధనం, ధాన్యం, పూజా ద్రవ్యాలు, పెద్దలకు కాళ్లు తగిలితే లక్ష్మికి కోపం వస్తుంది. ఎప్పుడూ గొడవలు పడే ఇండ్లల్లో లక్షీదేవి ఉండదు.
 
3. సోమరితనం, ప్రయత్నం లేకపోవడం లక్ష్మికి వీడ్కోలు పలుకుతాయి. స్త్రీలను కష్టపెట్టేచోట లక్ష్మి ఉండదు.