సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (17:49 IST)

ఆ గది ఆకారం గుండ్రంగా ఉంటే.. ఏమవుతుంది..?

కొందరైతే ఇంటి కట్టడంలో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఈ తప్పుల కారణంగా పలురకాల ఇబ్బందులు కూడా ఎదుర్కుంటారు. అందుకు ముఖ్య కారణం.. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం లేకపోవడమే. మరికొందరైతే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నా గదులు మాత్రం ఎలా అమర్చుకోవాలని తెలుసుకోరు. అలాంటి వారు వాస్తు ప్రకారం ఇలా పద్ధతులు పాటిస్తే.. తప్పక ఫలితం ఉంటుంది.
 
ఇంటిమీద కట్టడం తప్పుకాదు కానీ అది ఎలా కట్టాలి.. ఎక్కడ కట్టాలి అనే విషయాన్ని తెలుసుకుంటే చాలు. కింది ఫ్లోర్‌లో నైరుతిలో దిశలో పడకగది అమర్చుకుంటే.. అదే కొలతలో పైన గది కూడా అమర్చాలి. ఈ గదులకు ఫ్లోరింగ్ తప్పనిసరిగా ఉండాలి. అలానే స్లాబ్‌లెవల్ కన్నా ఎత్తుగా ఉండాలి.. ముఖ్యంగా ఫ్లోరింగ్ లేకుండా వదిలేయకూడదని పండితులు చెప్తున్నారు.
 
ఇంటి కట్టడంలో ఏ గది నిర్మించినా ఆ గది ఆకారం రౌండుగా మాత్రం ఉండకూడదు. ఒకవేళ అలాకుంటే.. ఆ ఇంట్లోని వారికి దాన శక్తి విచ్ఛన్నం అవుతుంది. ఈ గదుల్లో నివసించడం కూడా మంచిది కాదు. ఇలాంటి రౌండుగా ఉన్న గదుల్లో మనుష్యులే కాదు జంతువులు కూడా నివశించరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీరు రౌండుగా గదులు నిర్మించుకోవాలంటే.. నైరుతి దిశలో స్లాబ్ మీద గదిని మాత్రం గుండ్రంగా కట్టుకోవచ్చు.