మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 19 ఏప్రియల్ 2021 (19:22 IST)

ఇప్పుడు మన ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా?

మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి వికసించి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది. ఆహార ఉపాహారాల ఇష్టత లేని వానికి సుఖాపేక్ష ఉండదట. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదట. ఆమారాన్ని సక్రమంగా తీసుకొనని వారికి ఏ కోరికలు ఉండవట. ఇలా చెబుతోంది భగవద్గీత.
 
పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవుపేడతో ఆలికి సున్నంతో నాలుగువైపులా గీతలు వేసేవారు. దీని వల్ల సూక్ష్మక్రిములు భోజనశాలలోకి ప్రవేశించేవి కావు. మనుషులను పనిచేసే సూక్ష్మక్రిములను చంపే శక్తి ఆవుపేడలోనూను, ఆవు మూత్రంలోను ఉంది. భోజనం చేసిన తర్వాత కిందపడిన ఆహారపదార్థాలను తీసివేసి మరలా నీటితో ఆలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కీటకాలు రాకుండా ఉండేవి. 
 
మనకు శక్తిని ప్రసాదించి, మన ప్రాణాలను కాపాడి, మనలను చైతన్య వంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవసమానంగా భావించి గౌరవించి పూజించటంలో తప్పులేదు కదా. చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది. కాళ్ళు కడుక్కోకపోతే కుటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుంది. బయట నుంచి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవడం కూడా మన ఆచారాల్లో ఒకటి.
 
ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. తరువాత తాగటానికి మంచినీరు ఇస్తారు. మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం. అదే కాళ్ళతో రావడం వల్ల కుటుంబంలోని అందరి ఆరోగ్యాలకూ హాని కలుగుతుంది. ముఖ్యంగా పసి బిడ్డలకు మరింత హానిదాయకం. 
 
ఇప్పుడు మన ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా? కాలిబూట్లతో అన్నం తింటున్నాం. పరుగులు తీస్తున్నాం. బిజీ బిజీ బిజీ అవసరమైన అవసరాల కోసం అర్థం లేని జీవితము గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవడం విషయం అటుంచి చేతులు కూడా కడుక్కోలేని బిజీ అయిపోతున్నాం. ఇక ఆహారాన్ని గౌరవించే ఓపికా తీరికా ఎవరికి ఉంది?