మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (13:44 IST)

సకల దేవగణ తేజోస్వరూపిణి...?

శివుని తేజస్సుతో ఆమె ముఖపద్మం జనించింది. నిగనిగలాడే ఆమె దీర్ఘ కేశాలు యముని తేజంతో వచ్చాయి. ఆమె నేత్రత్రయం అగ్ని తేజోమయాలు. ఆమె కనుబొమలు ఉభయ సంధ్యల తేజస్సంజనితాలు. ఆ దేవి చౌవులు వాయుదేవుని అంశంలో ఉద్భవించాయి. ఆమె ముక్కు కుబేరుని తేజో జనితం. ప్రజాపతి తేజస్సు నుండి ఆమె పలు వరుస యేర్పడినది. సూర్యుని తేజస్సుతో ఆమె క్రింది పెదవి కుమారస్వామి తేజంతో కల్పితమైంది.
 
విష్ణుతేజంతో ఆ మహాదేవి అష్టాదశ బాహువులు రూపొందాయి. రక్త వర్ణం కల ఆమె వ్రేళ్ళు పసుపుల తోజంతో కల్పింపడినాయి. ఆమె స్తన యుగళం చంద్ర సంభవాలు. మూడు ముడతలు గల ఆమె నెన్నడుము ఇంద్ర తేజస్సంజనితం. కాలి పిక్కలూ, ఊరువులూ వరుణ కల్పితాలు, మొలధాత్రీ తేజం.