సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (12:10 IST)

గాయత్రీ దేవి మహిమ.. నా కోసం ఆకుపచ్చ దీపాలు వెలిగించాడు..?

Gayathri Mantra
గాయత్రీ మహిమను ఆ దేవదేవి యొక్క అనుగ్రహాన్ని గురించి తెలిపే ఓ చిన్న కథను తెలుసుకుందాం. కథలోకి వెళితే... నిరంతర గాయత్రీ ఉపాసకుడైన గౌరీపతి అనే వ్యక్తి వృద్ధాప్యంలో మరణించాడు.
 
దేవదూతలు అతన్ని మణి ద్వీపం చేర్చి అమ్మవారి చెంత వదిలి వెళ్లారు. తేజస్సుతో వెలిగిపోతున్న మాటను చూసి పులకించి పోయాడు గౌరీ పతి. అంతలో అదే దేవ దూతలు అతనికి బాగా తెలిసిన సింహాచలాన్ని తీసుకొచ్చారు. అతడిని చూసి ఆశ్చర్యపోయాడు గౌరీపతి.
 
"అమ్మా.. నాదొక సందేహం" వినమ్రంగా అన్నాడు. ఏమిటన్నట్టు చూసింది మాత.  నా చిన్నప్పటి నుంచి నీ మంత్రో పాసనే శ్వాసగా జీవిస్తున్నాను… నీ పూజలు తప్ప నాకు మరేమీ తెలియదు.. జీవన పర్యంతం నీ సేవలో గడిపాను.. ఇంట కష్టపడితే నీ పేరు తలవని పరమ నాస్తికుడైన సింహాచలం నీ , సన్నిధికి ఎలా రాగలిగాడు? అడిగాడు గౌరీ పతి.
 
గాయత్రీ దేవి ప్రశాంతంగా నవ్వి. "ఆతను నాస్తికుడే.. కానీ నా కోసం ఆకుపచ్చ దీపాలు వెలిగించాడు" అంది . గౌరీ పతికి అర్ధం కాలేదు.. సింహాచలం నాకు పూజలు చేయకుంటేనేం? అతను నిర్వర్తించింది నా సేవే .. ఎప్పుడూ పరుల సౌఖ్యం గురించి ఆలోచించాడు. 
 
మొక్కలు నాటుతూ మైళ్ళ కొద్దీ భూమిని పచ్చదనంతో నింపాడు.. పశు పక్ష్యాదులు ఆశ్రయం కల్పించాడు. ఆతను వెలిగించిన ఆ ఆకుపచ్చ దీపాలతో నేనెంతో సంతోషించాను"అంది.. అంతే గౌరీదేవి చెమర్చిన కళ్లతో నమస్కరించాడు. 
 
అదన్నమాట సంగతి. నిరంతం పూజతోనే దేవరుల అనుగ్రహం పొందవచ్చు అనుకుంటే పొరపాటు. పరుల కోసం ఆలోచించడం.. కష్టపడే వారికి సాయం అందించడం.. పరోపకారంతో దేవతాస్తుతి చేయడం ద్వారా ఉన్నత గతులు అందుతాయని గాయత్రీ మాత ఈ కథ ద్వారా తెలియజేసింది.