చీకటిలో ఎలాగైతే కొవ్వువత్తి జ్ఞాపకం వస్తుందో...
విజయం సాధించే వ్యక్తులు రెండు పాటిస్తారు. ఒకటి నవ్వు మరొకటి నిశ్శబ్దం.
నవ్వు సమస్యలను పరిష్కరించుకోవడానికి, నిశ్శబ్దం సమస్యల నుంచి తప్పించుకోవడానికి.
కష్టాలలో ఏడిస్తే అవి పెరిగి రెండింతలవుతాయి, తేలికగా తీసుకుంటే బుడగ వలే మాయమవుతాయి.
జయం నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అపజయం ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది.
చీకటిలో ఎలాగైతే కొవ్వువత్తి జ్ఞాపకం వస్తుందో అలా ఎదుటివారి కష్టాలలో నువ్వు జ్ఞాపకం వచ్చేటట్లు ప్రత్యేక గుణాలను కలిగి వుండు.