మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 30 మే 2018 (20:27 IST)

తిరుమలలో శ్రీవారికి ఇష్టమైన ప్రదేశాలు ఏమిటో తెలుసా..?

తిరుమల, తిరుపతి పేరు చెప్పగానే ఏడుకొండలు గుర్తుకు వస్తాయి. సాక్షాత్తు విష్ణుమూర్తే వెంకటేశ్వరుని రూపంలో కొలువై ఉన్న తిరుమల కొండలనే ఏడుకొండలు అంటారు. మనిషి మూలాధార చక్రం మొదలై ఆగ్నా చక్రం దాటితేనే... అంటే ఆరు చక్రాలు దాటితేనే గానీ మనిషికి ఆనందానుభూతి

తిరుమల, తిరుపతి పేరు చెప్పగానే ఏడుకొండలు గుర్తుకు వస్తాయి. సాక్షాత్తు విష్ణుమూర్తే వెంకటేశ్వరుని రూపంలో కొలువై ఉన్న తిరుమల కొండలనే ఏడుకొండలు అంటారు. మనిషి మూలాధార చక్రం మొదలై ఆగ్నా చక్రం దాటితేనే... అంటే ఆరు చక్రాలు దాటితేనే గానీ మనిషికి ఆనందానుభూతి కలుగదు. అప్పుడే ఆనంద నిలయంలోకి... అంటే బ్రహ్మ స్థానంలోకి చేరుకుంటారు. ఇక్కడ కూడా అంతే. 
 
వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చి ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీవారిని దర్శించాలంటే ఆరు కొండలు దాటి ఏడవ కొండపై చేరుకుని స్వామివారిని దర్శించుకోవాలి. ఏడుకొండల వెనుక పెద్ద రహస్యమే ఉంది. ఒకప్పుడు ఏడుకొండలను సాలగ్రామాలు అనేవారు. 
 
శ్రీవారు ఆ ఏడు కొండలపైకి కూర్చునే వారని పురాణాలు చెబుతున్నాయి. ఒక్కో కొండపై ఆయన సేదతీరేవారట. అందుకే ఆ కొండలకు ఆ పేర్లు వచ్చాయట. ఆ ఏడుకొండలను దాటి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.