ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 10 ఆగస్టు 2018 (18:54 IST)

పెరట్లో తులసి మొక్క అలా వుంటే... ఇంట్లో ఇలాంటి మార్పులుంటాయా?

దాదాపు తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి వల్ల మనకు అనేక ప్రయోజనాలున్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని అంతా మంచే జరుగుతుందని నమ్మకం. అంతేకాదు తులసి ఆకుల వల్ల మనం పలు జబ్బులను కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు

దాదాపు తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి వల్ల మనకు అనేక ప్రయోజనాలున్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని అంతా మంచే జరుగుతుందని నమ్మకం. అంతేకాదు తులసి ఆకుల వల్ల మనం పలు జబ్బులను కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ, ఈ తులసి మొక్క తన సహజరంగును కోల్పోవడమో, ఆకులు సడన్‌గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చట. ఒక రకంగా తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలట. 
 
తులసిలో మార్పులు... వాటి అర్థం ఏమిటో తెలుసుకుందాం...
1. తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే... ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయట. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థమట.
 
2. ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే... ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థమట. భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుందట.
 
3. పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే.... ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరుగబోతుందని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం. 
 
4. చెట్టు ఆకులు సడన్‌గా వేరే రంగుకు మారితే... ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థమట. ఎవరైనా గిట్టనివారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయట. 
 
దీనినిబట్టి తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు... తులసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలో మార్పులు గమనిస్తూ ఉండాలి.