శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 2 మే 2022 (21:47 IST)

అవి మూడు అశ్వమేధ యాగంతో సమానమైనవి

నిత్యం కాకులు అరుస్తుంటాయి. వాటిని ఎవరూ ఇష్టంగా వినకపోగా ఏంటీ కాకిగోల అంటూ విసుక్కుంటారు. అదే కోయిల ఒక్కసారి కుహూ అంటే... ఎంత మధురంగా వుందీ స్వరం అంటూ చెవులు రిక్కించి వింటారు. లోకం తీరు కూడా అంతే.. సామాన్య వ్యక్తులు ఏదేదో మాట్లాడినా పట్టించుకోరు. పండితుడు నోటివెంట వచ్చే మాటలను మాత్రం శ్రద్ధగా ఆలకిస్తారు.

 
దారిద్ర్యంతో బాధపడుతున్నవారికి దానం చేయడం, పూజా పురస్కారాలు లేకుండా శూన్యమైన శివలింగాన్ని తాను పూనుకుని పూజించడం, అనాధగా పడి వున్న శవానికి దహన సంస్కారాలు జరిపించడం... ఈ మూడు మహత్కార్యాలు. ఇవి అశ్వమేధయాగంతో సమానమైనవి. వీటిలో ఏది ఆచరించగలిగినా అపారమైన పుణ్యం సంప్రాప్తిస్తుందని చెప్పబడింది.