దరిద్రే యవ్వనం వృథా
వృథావృష్టి స్సముద్రేచ
వృథా-తృప్తే చభోజనమ్
వృథా ధనపత్రపు దానం
దరిద్రే యవ్వనం వృథా
భూమ్మీద వాన కురిస్తే ఉపయోగం కానీ సముద్రంలో ఎంత వాన కురిస్తే ఏంటి లాభం? ఆకలితో నకనకలాడేవాడికి భోజనం పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది కానీ, కడుపు నిండినవానికి ఆహారం ఇచ్చి ఏంటి ప్రయోజనం? దనహీనుడికి దానం చేయమన్నారు కానీ ధనికునికి ఇస్తే ఒరిగేదేమి ఏమిటి?
యవ్వన సుఖం అనుభవించడానికి ధనం వుండాలి కానీ, యవ్వనం పోయాక ధనం వుండి ఏంటి లాభం...?