నకిలీ రుద్రాక్షలను ఎలా కనుక్కోవాలి?
రుద్రాక్షలను కొందరు నకిలీవి అంటకడుతుంటారు. నకిలీ రుద్రాక్షలను కనుగొనాలంటే ఈ క్రింది పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు.
ఒక చిన్న గిన్నెలో మంచినీరు పోసి దానిలో రుద్రాక్ష వేసినట్లయితే నకిలీది మునగకుండా తేలుతూ వుంటుంది. అంతేకాదు దాని రంగు కూడా వెలిసిపోతుంది.
రెండు రాగి రేకుల మధ్య రుద్రాక్షను వుంచినట్లయితే అది తన చుట్టూ తానే సవ్యదిశలో తిరగడం ప్రారంభిస్తుంది. అపసవ్యంగా తిరిగితే అది నకిలీదిగా గుర్తించాలి.
ఆవు పాలలో రుద్రాక్షను వేసినట్లయితే ఆ పాలు 48 గంటల నుంచి 72 గంటల వరకూ చెడిపోకుండా విరిగిపోకుండా వుంటాయి. అలా కాని పక్షంలో అది నకిలీ రుద్రాక్షగా పరిగణించాలి.