గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (23:18 IST)

వీడే దరిద్రుడు, దారిద్ర్యం అనేది ఎలా వుంటుందో తెలుసా?

దరిద్రుడు అని తిడుతూ వుంటారు చాలామంది. అసలు దరిద్రుడు అనేవాడు ఎలా వుంటాడో చెప్పారు పెద్దలు. దరిద్రుని తల్లి అతడికి తప్పులు నూరిపోస్తుంది. భార్య అతడి మాటలను లక్ష్యపెట్టదు. అతడి నోటి నుంచి వచ్చే మాటలన్నీ విపరీతంగా తోస్తుంటాయి.

 
తీరని దుఃఖాన్ని తెస్తాయితప్ప సుఖాన్నివ్వవు. న్యూనతాభావంతో కొట్టుమిట్టాడుతుంటాడు. పదిమందిలోకి పోవాలంటే సంకోచంతో కుంచించుకుపోతాడు. ఐశ్వర్యవంతుని ఎదుట నిలబడేందుకు భయపడతాడు. శౌర్యం సన్నగిల్లుతుంది.

 
ఇంటికి వచ్చిన చుట్టాలు అతడికి యమదూతల్లా కనిపిస్తారు. ఎక్కడా పెత్తనం దక్కదు. ఎవరితో ఏమి చెప్పినా తిరిగి మాట్లాడరు. అందరూ చులకన చేస్తూ మాట్లాడుతారు. అపహాస్యం పాలుచేస్తారు. అలాంటివాడే దరిద్రుడు.