మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 26 ఆగస్టు 2021 (23:12 IST)

నూతన వధూవరులకు అరుంధతీ నక్షత్రం ఎందుకు చూపిస్తారు?

అరుంధతీ నక్షత్రం. పెళ్లయ్యాక వధూవరులకు పురోహితుడు అరుంధతీ నక్షత్రం అదిగో దర్శించుకోండి అని చూపిస్తారు. అసలు ఎవరీ అరుంధతి? అరుంధతీ దేవి మహా పతివ్రత.
 
అగ్ని హోత్రుడు సప్తఋషుల భార్యల అందానికి మోహింపబడి క్షీణించి పోతూ ఉండగా వివరం తెలుసుకున్న అగ్ని హోత్రుడి భార్య స్వాహా దేవి వశిష్టుడి భార్య అయిన అరుంధతి తప్ప మిగతా అందరి భార్యల వేషమూ వెయ్య గలిగింది. కానీ ఎంత ప్రయత్నించినా అరుంధతీ దేవి వేషం వెయ్యలేక పోయింది. అందుకనే మహా పతివ్రత అయిన అరుంధతి కూడా నక్షత్రం నూతన వధూవరులకి సప్తపది అయిన తరువాత చూపించ బడుతుంది. ఇది అగ్నిహోత్రుడు ఆమెకి ఇచ్చిన వరము.
 
అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లిసమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ రుతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది.