శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 3 డిశెంబరు 2020 (16:27 IST)

కపిలేశ్వరాలయంలో రుద్ర‌యాగం ప్రారంభం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) గురువారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్నహోమ మహోత్సవాల్లో భాగంగా డిసెంబ‌రు 13వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హిస్తారు.
 
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ‌, రుద్ర‌జ‌పం, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, నివేద‌న, హార‌తి నిర్వహించారు. సాయంత్రం పూజ‌, జ‌పం, హోమం, రుద్ర‌త్రిశ‌తి, బిల్వార్చ‌న‌, నివేద‌న‌, విశేష‌దీపారాధ‌న, హార‌తి ఇస్తారు.
 
పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో మారుమ్రోగింది కపిలేశ్వర ఆలయం. ప్రతి యేడాది హోమాలను నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది.