గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2017 (14:18 IST)

భక్తుల గిరిగా మారిపోయిన తిరుమల.. తాగునీరు కూడా కరువైంది..

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరుమల గిరి భక్తుల గిరిగా మారిపోయింజి. కాలినడనక వచ్చే భక్తులతో కాలిబాట మార్గాలు కిక్కిరిశా

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరుమల గిరి భక్తుల గిరిగా మారిపోయింజి. కాలినడనక వచ్చే భక్తులతో కాలిబాట మార్గాలు కిక్కిరిశాయి. అర్ధరాత్రి 12.01 నుంచే భక్తులను క్యూ లైన్లోకి అనుమతించారు. క్యూలైన్లు నిండిపోవడంతో ఔటర్ రింగు రోడ్డుపై 50వేల మంది భక్తులు నిలిచి వున్నారు. 
 
శ్రీవారి దర్శనానికి 24 గంటలు పట్టే అవకాశం ఉంది. మరో  రెండు రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్దీ తప్పదని.. ఇకపై వచ్చే భక్తులకు ఉత్తర ద్వార దర్శనం అసాధ్యమని టీటీడీ అధికారులు తెలిపారు. నారాయణవనం కంపార్ట్‌మెంట్లు, తాత్కాలిక క్యూలైన్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనానికి వచ్చిన లక్షలాది మందికి పైగా భక్తులు క్యూలైన్లలో అష్ట కష్టాలు పడుతున్నారు. 
 
భక్తులు క్యూలైన్లలో నిరీక్షిస్తుండగా, చలి తీవ్రత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అద్దె గదులు దొరికే పరిస్థితి లేకపోవడంతో వెలుపులే ఉన్న 30వేల మంది భక్తులు తమ పిల్లలతో చలిలో వణికిపోతూ పడిగాపులు కాశారు. కనీస వసతులు లేకుండా భక్తులు టీటీడీపై మండిపడుతున్నారు. దీంతో తాగునీటి వసతులు వెంటనే కల్పిచాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు.