శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (11:01 IST)

#kalyanipriyadarshan : ఒక్క చిత్రంతోనే ఎలా వాడుకోవాలో తెలుసుకున్నా...

మలయాళ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్, హీరోయిన్ లిజిల ముద్దుల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్. ఈమె నటించిన తొలి చిత్రం 'హలో'. ఈ చిత్రంతోనే వెండితెరకు పరిచయమైంది.

మలయాళ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్, హీరోయిన్ లిజిల ముద్దుల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్. ఈమె నటించిన తొలి చిత్రం 'హలో'. ఈ చిత్రంతోనే వెండితెరకు పరిచయమైంది. అదీకూడా అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నటించిన "హలో" చిత్రంలో నటించి నటనా పరంగా మంచి మార్కులు కొట్టేసింది.
 
'మనం' ఫేం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అక్కినేని నాగార్జున ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో కళ్యాణి ఓ అందమైన పాత్ర పోషించి అందరినీ మెప్పించింది.
 
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టి ట్విట్టర్‌లో కొత్తగా ఖాతా ప్రారంభించిందీముద్దుగుమ్మ. మొట్టమొదటి పోస్ట్‌గా 'హలో' సినిమాలోని తన అందమైన లుక్ అభిమానులతో పంచుకుంటూ 'హలో.. మొత్తానికి ట్విట్టర్ ఎలా వాడాలో నాకు నేను నేర్చుకున్నా..' అని టాగ్ చేసింది.