శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (15:28 IST)

మకరసంక్రాతి రోజున పెరుగు దానం చేస్తే? అశ్వత్థామ ఎలా జన్మించాడో తెలుసా?

మకర సంక్రాంతి రోజున చేసే దానాలు విశేష ఫలితాలను ఇస్తుంది. దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. పూర్వకాలంలో గుణవంతురాలు, పతీవ్రతా శిరోమణి అయిన ''కృపి'' అనే పుణ్యస్త్రీ ఉండేది. ఈమె ఎవరో కాదు. ద్రోణాచార్యుల భార

మకర సంక్రాంతి రోజున చేసే దానాలు విశేష ఫలితాలను ఇస్తుంది. దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. పూర్వకాలంలో గుణవంతురాలు, పతీవ్రతా శిరోమణి అయిన ''కృపి'' అనే పుణ్యస్త్రీ ఉండేది. ఈమె ఎవరో కాదు. ద్రోణాచార్యుల భార్య. ఒకనాడు ద్రోణాచార్యుడు ఆశ్రమంలో లేని సమయంలో దుర్వాస ముని సమిధల కోసం అన్వేషణ సాగిస్తూ అటుగా వచ్చాడు. వచ్చిన మునిని కృపి పూజించి తమ పేదతనాన్ని చెప్పుకుంది. తమకు పిల్లలు కూడా లేరని చెప్పుకుంది. ఆమె ప్రార్థనకు ముని దయార్ద్ర హృదయుడై, సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోవాల్సిందిగా ఉపదేశించాడు. 
 
ఆ వ్రత విధానం గురించి వివరిస్తూ.. ఇది వరకూ ఈ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందిన యశోద గురించి చెప్తాడు. అందుకే మకర సంక్రాంతి రోజున బ్రాహ్మణులకు పెరుగన్నం దానం చేస్తే సంతానం, సౌభాగ్యం కలుగుతుందని వివరించాడుయ వెంటనే కృపి దగ్గరగా ఉన్న నదికి వెళ్ళి శరీరానికి నువ్వుల పిండి రాసుకుని స్నానం చేసి వచ్చి.. దుర్వాస మహామునికి పెరుగు దానం చేసింది. అలా దానం చేయడం ద్వారా ఆమెకు అశ్వత్థామ పుట్టాడు. ఈ విధంగా సంక్రాంతి నాడు దానాలు చేసినట్లైతే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.