బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (21:33 IST)

భోగి పండుగ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదట!

bhogi
2024లో భోగీ పండుగ జనవరి 13న కాకుండా జనవరి 14న ఉంటుంది. ఈ రోజున భోగి మంటలను వెలిగిస్తారు. భోగి రోజున చిన్నారులకు అన్నదానం చేయడం మంచిది. భోగీ నాడు అగ్నిదేవుడిని తప్పకుండా పూజించండి. ఇలా చేయడం వల్ల మీరు శుభ ఫలితాలను పొందుతారు. భోగి పండుగ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గోధుమలను ఎర్రటి వస్త్రంలో కట్టి దానం చేయాలి. 
 
భోగి రోజున మాంసం, వెల్లుల్లి, ఉల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. భోగి పండుగ నాడు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఈ రోజున పెద్దలకు గౌరవం ఇవ్వాలి. శ్రీ మహా విష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం. 
 
శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని పండితులు చెబుతారు. శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి నాడే. ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ఆశిస్తూ భోగి మంటలను వేస్తారు. ఈ మంటల్లో ఆవు పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తారు.