బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (20:53 IST)

మకర సంక్రాంతి తెల్లనువ్వులు దానం చేస్తే.. సర్వశుభాలు..

sankranti
మకర సంక్రాంతి రోజు నుంచే పగలు సమయం పెరిగి రాత్రుల సమయం తగ్గుతుంది. ముఖ్యంగా సూర్యభగవానుడిని పూజించి దానాలు చేయడం వల్ల జీవితంలో శ్రేయస్సు, ఆనందం, సుఖసంతోషాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పాటు తెల్ల నువ్వులను దానం చేయడం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేస్తాడు. 
 
తెల్ల నువ్వులు అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం.. కాబట్టి ఈ రోజు తెల్ల నువ్వులను దానం చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభించి ఇంట్లో సంపాదన రెట్టింపు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.