గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. సంక్రాంతి
Written By chj
Last Modified: సోమవారం, 9 జనవరి 2017 (22:09 IST)

పందెం కోళ్ళు సంక్రాంతికి సిద్ధం... నిషేధం విధించినా....

పల్లెల్లో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకువచ్చేది కోడి పందేలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు, నిరుపేద నుంచి కోటీశ్వరుని వరకు ఇవి ఎక్కడ జరుగుతున్నా అక్కడ వాలిపోతారు. ‘డేగా..కాకి.. నెమలి.. పింగళి.. పర్ల.. సీతువా.. కొక్కిరాయి.. పూల.. మైల.. రసంగి.. సవళ'

పల్లెల్లో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకువచ్చేది కోడి పందేలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు, నిరుపేద నుంచి కోటీశ్వరుని వరకు ఇవి ఎక్కడ జరుగుతున్నా అక్కడ వాలిపోతారు. ‘డేగా..కాకి.. నెమలి.. పింగళి.. పర్ల.. సీతువా.. కొక్కిరాయి.. పూల.. మైల.. రసంగి.. సవళ' ఈ పేర్లన్ని పందెం కోళ్లకు సంబంధించినవే. ఆశ్చర్యంగా ఉన్నా నిజం. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రధాన వృత్తిగా నిర్వహించే పశువులు, కోళ్లకు అనుబంధంగా ఎడ్ల పందేలు, కోడిపందేలు నిర్వహించడం సంక్రాంతి సంబరాల్లో సంప్రదాయంగా వస్తోంది. అయితే ఎడ్ల పందేలు కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమతమయ్యాయి. కోడి పందేలు చట్టరీత్యా నిషేధించబడటంతో పలు గ్రామాల్లో నవంబర్ నుంచి జనవరి వరకు జోరు కొనసాగుతుంది. నగరాల్లో నివశించే వారుకూడా ఈ పండుగను పురస్కరించుకుని కోడి పందేలపై మక్కువతో తమ గ్రామాల్లో వాలిపోతారు.
పందెం ఆడుతున్న దృశ్యం
 
ప్రధానంగా కత్తి పందేలంటూ రెండు రకాలున్నాయి. ‘కోడిని చూసి ఎంపిక చేసుకునే రకం', ‘ముసుగువేసి కాసే పందెం' ఇలా రెండు విధాలుగా కోడి పందేలను నిర్వహిస్తారు. వీటిపై నిషేధం లేనిరోజుల్లో గ్రామాల్లో ముమ్మరంగా కోండి పందేలు జరిగేవి. పూర్వపు రోజుల్లో పందెం పుంజుల కాళ్లకు కత్తులు కట్టకుండా పందేలు నిర్వహించే వారు. ప్రత్యర్థి కోడి మరణించే వారికి ఈ పోటి జరిగేది. తరువాతి కాలంలో కోళ్ల కాలికి కత్తి కట్టి కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే పందేలు మొదలయ్యాయి. ఒక కోడికి ఎవరూ చూడకండా కత్తి కట్టి ముసుగులో ఉంచి, బరిలో దింపుతారు. ముసుగులో ఉన్న కోడి బలాబలాలతో సంబంధం లేకుండా పందెం రాయుళ్లు పోటీకి దిగాలని ఆహ్వానిస్తారు. దీన్నే ముసుగు పందెమంటారు.
 
కోడి పందేల్లో ఐదు హెచ్చు, ఆరు హెచ్చు అనే పందెపు విధానాలు అమలలో ఉన్నాయి. ఐదు హెచ్చుఅంటే గెలిచే కోడిపై ఉన్న నమ్మకంతో పందెం కాసినవారికి నగదుకు 25 శాతం ఎక్కువ, ఆరు హెచ్చు అంటే 50 శాతం అదనం. ఫలానా రంగు కలిగిన కోడి పై ఫలానా సమయంలో ఫలానా రండు కోడి విజయం సాధిస్తుందని తెలిపేది కుక్కుట శాస్త్రం. తమ కోడి రంగు ప్రకారం ఏ సమయంలో పందేనికి సిద్ధం చేయాలనే మహూర్తాలు కూడా నిర్ణయించుకుంటారు. వాళ్ల చేతిలో పడగానే..? పందెంగాళ్లు రైతు వద్ద నుంచి మామూలు ధరకే కోడి పుంజులను కొనుగోలు చేస్తారు. వీటిని పందేలకు సిద్ధం చేయటంలో భాగంగా భారీ మొత్తంలో వెచ్చిస్తారు. 
 
జీడిపప్పు, బాదం, గుడ్లు వంటి బలవర్థక ఆహారాన్ని క్రమంతప్పకుండా ఇస్తారు. సదరు పుంజు ఒకసారి పందెంలో విజయం సాధిస్తే రెట్టింపు ధర పలుకుతుంది. ఎన్నిసార్లు విజయం సాధిస్తే అంతకంతకూ కోడి ధర పెరిగ, వేల నుంచి లక్షలకు చేరిపోతుంది. ఒక్కసారి ఓడిపోతే మాంసంగానే మిగులుతుంది. నిషేధం ఉన్నప్పటికి..? కోడి పందేల మాటున నగదు మార్పిడితో క్రమంగా ఇడి భారీ జూదంగా మారిపోయింది. దీంతోపాటు జీవహింస పెరుగుతోందనే ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. అయినా సంక్రాంతి సంబరాల్లో భాగమైన వీటిని దాదాపు ప్రతి గ్రామంలోనూ చాటుమాటుగా కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.