ఆసియా క్రీడల షూటింగ్ : అభినవ్ బింద్రాకు బంగారు పతకం!
ఇంచియాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రాకు తొలి బంగారు పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. 31 ఏళ్ల బింద్రా 187.1 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన యాంగ్ (209.6) స్వర్ణం, ఇఫాయ్ కావో (208.9) వెండి పతకాలు గెల్చుకున్నారు.
అంతకుముందు జరిగిన పురుషుల 10 మీటర్ల టీమ్ ఈవెంట్‌లోనూ సంజీవ్ రాజ్పుత్, రవి కుమార్‍తో కలిసి బింద్రా కాంస్యం దక్కించుకున్నాడు. కాగా, అంతర్జాతీయ షూటింగ్ కెరీర్‌కు బింద్రా గుడ్‌బై చెప్పిన విషయం తెల్సిందే.