మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (15:44 IST)

సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ కామెంట్స్ : మహిళా కమిషన్ సీరియస్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ను పంజాబ్‌లో అడ్డగించడాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఖండించింది. ప్రధాని మోదీపై దాడికి యత్నించడం పిరికింద చర్య అని పేర్కొంది.
 
ఈ ట్వీట్‌పై నటుడు సిద్ధార్థ్ స్పందించాడు. "ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్... దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించాడు. అయితే సిద్ధార్థ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. 
 
ఓ స్త్రీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, స్త్రీద్వేషంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని పేర్కొంది. నటుడు సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, సుమోటోగా ఈ వ్యవహారాన్ని విచారణకు స్వీకరిస్తున్నామని కమిషన్ వెల్లడించింది. 
 
జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఈ వ్యవహారంపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేయాలని ఆదేశించారని ఓ ప్రకటనలో తెలిపింది.
 
సోషల్ మీడియా వేదికగా ఓ మహిళపై అసభ్యకరమైన భాషను ఉపయోగించడం పట్ల ఆ నటుడ్ని కఠినంగా శిక్షించాలని కోరింది. కాగా తన వ్యాఖ్యలను వేరే అర్థంలో తీసుకుని తప్పుగా భావిస్తున్నారని సిద్ధార్థ్ మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చాడు.