శుక్రవారం, 21 నవంబరు 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2025 (09:37 IST)

ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో అదరగొట్టిన భారత బాక్సర్లు.. తొమ్మిది పసిడి పతకాలు సొంతం

Indian Boxers
Indian Boxers
స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ నేతృత్వంలోని భారత మహిళా బాక్సర్లు అద్భుతంగా రాణించి తొమ్మిది బంగారు పతకాలను సాధించారు. గురువారం జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో హితేష్ గులియా, సచిన్ సివాచ్ కూడా బంగారాన్ని సొంతం చేసుకున్నారు. 
 
ఆతిథ్య జట్టు మొత్తం 20 వెయిట్ విభాగాలలో కనీసం ఒక పతకాన్ని సాధించి, తొమ్మిది బంగారు, ఆరు రజత, ఐదు కాంస్య పతకాలతో సత్తా చాటింది. 15 మంది భారతీయ ఆటగాళ్లు బరిలోకి దిగి ప్రత్యర్థులపై ధీటుగా రాణించారు.  
 
ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు జైస్మిన్ లంబోరియా (57 కిలోలు), మినాక్షి హుడా (48 కిలోలు), ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ (54 కిలోలు), ప్రపంచ కాంస్య పతక విజేత పర్వీన్ హుడా (60 కిలోలు), మాజీ యూత్ ప్రపంచ ఛాంపియన్ అరుంధతి చౌదరి (70 కిలోలు), నూపుర్ షియోరాన్ (+80 కిలోలు) కూడా స్వర్ణ పతకాలను సాధించారు. 
 
జదుమణి సింగ్ (50 కిలోలు), అభినాష్ జామ్వాల్ (65 కిలోలు), పవన్ బర్త్వాల్ (55 కిలోలు), అంకుష్ ఫంగల్ (80 కిలోలు), నరేందర్ బెర్వాల్ (+90 కిలోలు) మరియు పూజా రాణి (80 కిలోలు) రజత పతకాలతో ముగించారు. నీరజ్ ఫోగట్ (65 కిలోలు), సావీతి (75 కిలోలు), సుమిత్ కుందు (75 కిలోలు), జుగ్నూ (85 కిలోలు) మరియు నవీన్ (90 కిలోలు) కాంస్య పతకాలు సాధించారు.