శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (21:58 IST)

క్రికెట్ కాదు.. టెన్నిస్ కోర్టులో ధోనీ.. ఈసారి జేఎస్‌సీఏ టోర్నీలో..?

Dhoni
టీమిండియా ప్రస్తుతం టీ-20 ప్రపంచ కప్‌ ఆడుతోంది. ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎక్కడా కనబడలేదే అందరూ అనుకుంటుంటే.. ధోనీ మాత్రం టెన్నిస్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ధోనీ రాంచీ జేఎస్‌సీఏ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడుతున్నాడు. ధోనీ స్వస్థలం రాంచీ అనే సంగతి తెలిసిందే. తాజాగా ధోనీ టెన్నిస్ మ్యాచ్‌లో పాల్గొంటున్నాడు. 
 
ధోని క్రికెట్‌తో పాటు టెన్నిస్‌ను తన ఫేవరెట్ స్పోర్ట్స్‌గా ఆస్వాదిస్తాడనే సంగతి తెలిసిందే. టెన్నిస్ రాకెట్‌తో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా ధోనీ స్వయంగా టెన్నిస్ కోర్టులో దిగడం ఫ్యాన్సుకు పండగ చేసుకునేలా చేస్తోంది. తప్పకుండా ఈ టోర్నీలో ధోనీ గెలవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.