ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడుగా ప్రదీప్
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ప్రో కబడ్డీ లీగ్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు సాగుతున్నాయి. ఈ వేలంలో స్టార్ ఆటగాడు ప్రదీన్ నర్వాల్ ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
యూపీ యోధ జట్టు పీకేఎల్ వేలంలో ఈ ఆటగాడిని రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేసింది. ప్రదీప్‌ను ఏకంగా రూ.1.65 కోట్లకు సొంతం చేసుకుంది. అదేసమయంలో మరో స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరిని కేవలం రూ.40 లక్షలకు పుణెరి పల్టాన్ కొనుక్కోగలిగింది.
ఇదిలావుంటే, సిద్ధార్థ్ దేశాయ్‌ను తెలుగు టైటాన్స్ రూ.1.30 కోట్లతో అట్టిపెట్టుకుంది. మంజీత్‌ను రూ.92 లక్షలకు తమిళ తలైవాస్ చేజిక్కించుకుంది.
సచిన్ (రూ.84 లక్షలు)ను పట్నా పైరేట్స్, రోహిత్ గులియా (రూ.83 లక్షలు)ను హరియాణా స్టీలర్స్, సుర్జీత్ సింగ్ (రూ.75 లక్షలు)ను తమిళ్ తలైవాస్, రవిందర్ పాహల్ (రూ.74 లక్షలు)ను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేశాయి.